కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎకరాకు రైతుబంధు 15000 చెల్లిస్తాం
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
మోమిన్ పేట అక్టోబర్ 21 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులకు రైతుబంధు ఎకరాకు 15000 చెల్లించి ఎరువులు విత్తనాలు ఉచితంగా అందిస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని బంటారం మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఎన్నో ప్రయోజన మైన పథకాలు ప్రవేశపెడతామన్నారు స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కన్న కలలు నిజం కావాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరమన్నారు దేశాన్ని దోచుకో తింటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆస్తులను మొత్తం ప్రైవేటుపరం చేసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఆరోపించారు నిత్యవసర ధరలు పెంచి సామాన్య ప్రజలకు మోయలేని భారం వేస్తున్నారని ఆరోపించారు టిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కయి దేశాన్ని దోచుకుంటున్నాయని ఆయన అన్నారు భూమిలోని నిరుపేదలందరికీ పట్టా భూమితో పాటు ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు దేశంలో రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమియాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని అన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం రాష్ట్ర నాయకులు రఘుపతి రెడ్డి ఎంపిటిసి పద్మమ్మ రత్నారెడ్డి కృష్ణారెడ్డి అనంతరెడ్డి రవీందర్ రెడ్డి రవీందర్ సాగర్ నర్సింలు ముదిరాజ్ మొగులయ్య నర్సింలు రాములు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు