కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ అధ్వర్యంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మర్పల్లి నవంబర్ 08 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మల్కాజిగిరి
ఎంపీ రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యు. రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వారం రోజున మర్పల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి. ఖళీమోద్దీన్, కార్యనిర్వహక అధ్యక్షులు రఫియోద్దీన్, రాచన్న, మండల పార్టీ ఉపాధ్యక్షుడు సలీం, జిల్లా కార్యదర్శి ఎ. సంజీవరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కె.సర్వేశ్, నాయకులు ధన్ సింగ్, మన్మోహన్, డి.కృష్ణ రెడ్డి, కొంగరా.శ్రీనివాస్ రెడ్డి, దేవరాజ్, కె.శ్రీనివాస్ రెడ్డి, వై.కిష్టయ్య, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.