*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 :
జనం సాక్షి

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి, పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పోరాట నాయకురాలు చాకలి ఐలమ్మ , తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని త్యాగాలు ధైర్య సాహసాలు చేశారని వారి త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు,ఈ కార్యక్రమంలో జెట్టి లింగం ,పొట్ట రాజేశ్వర్ ,శంకర్ రెడ్డి, తిప్పి రెడ్డి అంజిరెడ్డి ,కంబా సురేష్, అందేమారుతీ ,నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు .