కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలి
జనంసాక్షి, రామగిరి : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరి కాలనీ లోని ఐఎన్టీయూసీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కర్ణాటక తరహాలో 3000 ఓట్లకు ఒక క్లస్టర్ ను ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే బుద్ధుల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక అని , సీనియర్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో మంథని అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్,సెంటినరి కాలనీ టౌన్ అధ్యక్షుడు కాటం సత్యం, మండలం మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పబ్బతి రాధా, ఎస్సీ సెల్ సెల్ అధ్యక్షుడు మంథని రవీందర్, బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం,యూత్ అధ్యక్షుడు దాసరి శివ, ఎంపీటీసీ లు
తీగల, సమ్మయ్య, కొప్పుల గణపతి, కొట్టే సందీప్,మాజి ఎంపీటీసీ వనం రామచంద్రరావు, రామయ్యపల్లి దేవునిరి రజిత శ్రీనివాస్ , నాగపెళ్ళి మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, ఉప సర్పంచ్, నరేష్ యాదవ్, రామగిరి మండలం మహిళాల ఉపాధ్యక్షురాలు జాగారి రజిత , సెంటినరి కాలనీ మహిళాల టౌన్ అధ్యక్షురాలు ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు గౌరవ ప్రజాప్రతినిధులు,మాజి ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.