కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలపంపిణీ

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు ఎనబై మంది పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసంపెల్లి నరేష్ గారు మాట్లాడుతూ పాఠశాల ను, సందర్శించి తదనంతరం
పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ ఇప్పటివరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అదేవిదంగా పాఠశాలలో విద్యుత్ కనక్షన్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఉడకపోతతో ఇబ్బందికి గురవుతున్నారని ఆరోపించారు అదేవిదంగా విద్యార్థులకు ఉన్నటువంటి టాయిలెట్స్ వాటర్ కనెక్షన్ లేకపోవడం తో నిరుపేయంగా
ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పడాల మహేష్ రాళ్లబండి శేఖర్ ఆసంపెల్లి నరేష్ మానుమండ్ల రమేష్ పవన్ వెంకటేష్ తదితరులు పాలొగొన్నారు

తాజావార్తలు