కాండంతోలుచు పురుగును అరికట్టాలి….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- వరి పంటలో కాండం తోలుచు పురుగు నివారణకు త్వరగతిగా చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అంతారం ఫైజాబాద్ చండూర్ గ్రామాలలో పర్యటించి వ్యవసాయ పంట పొలాలను పరిశీలించడం జరిగింది ప్రస్తుతం వరి పంటలో వెన్ను పైకి వచ్చే దశలో ఉందని ఈ దశలో కాండం తోలుచు పురుగు ఉంటుందని రైతులకు తెలియజేశారు ఈ పురుగు ఆశించడం వల్ల తెల్ల కంకి వస్తుందని అన్నారు ఈ కాండం తోలుచు పురుగు నివారణకు క్లోరి పైరిపాస్ మందు ఎకరానికి 400 గ్రాములు పిచికారి చేయడం ద్వారా కాండం తొలిచూపురుగును నివారించుకోవచ్చు అని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ భూపాల్ రైతులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు