కాకతీయ ఉత్సవాలు ప్రారంభం
వరంగల్: తెలంగాణ వాదుల నిరసనలు, హోరెత్తించే జైతెలంగాణ నినాదాల మధ్య కాకతీయ ఉత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కిల్లా వరంగల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగిస్తూ ఉత్సవాలను ప్రారంభిస్నుట్టు వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బలరాంనాయక్ మరో మంత్రి చిరంజీవి పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు అసంతృప్తి
కాకతీయ ఉత్సవాల పట్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల ప్రాభావాన్ని చాటే విధంగా ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలను జరపాలని తెలంగాణ ప్రజలు చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర సర్కారు పెడచెవిన పెట్టింది. ఈ ఉత్సవాలకు నూటయాబై కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాదులు చేసిన ఆందోళనలను అణచివేసింది. అత్తెసరు నిధులను ఈ ఉత్సవాలకు కేటాయించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.