‘ కాగ్‌ ‘ను అణచాలని చూస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : కంస్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను తన ఏజెంటుగా యూపీఏ ప్రభుత్వం తయారుచేయాలనుకుంటోందని ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ సంస్థను అణచివేయాలని కోరుకుంటుందోందన్నారు. కాగ్‌ ఎంపిక రాజకీయాలకతీతంగా జరగాలని కోరారు. దర్యాప్తు జరిగిన తరువాతే ఎంపికచేయాలన్నారు. కాగ్‌లో బహుళ సభ్యులను నియమించి సంస్థను పలుచన చేయాలన్న ప్రభుత్వ యోచనను ఆయన ఎండగట్టారు. కాగ్‌లో మరికొంతమంది సభ్యులు చేయాలని చూస్తున్న ప్రభుత్వ లక్ష్యం దురుద్దేశంతో కూడినదన్నారు. కాగ్‌ను బలహీనపరచాలని చూస్తున్నారన్నారు. రాజకీయనేతల నుంచి కాగ్‌ను దూరంగా ఉంచాలన్నారు. ఆయన నవంబర్‌ 26న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. కుంటుందని వ్యాఖ్యానించారు.