కాపర్ వైర్ దొంగల అరెస్టు

గత కొంతకాలంగా బాన్సువాడలో కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ఐదుగురు అంతర జిల్లాల దొంగలను గురువారం బాన్సువాడ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి.ఎస్.పి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత నెలలో పట్టణంలోని కాపర్ వైర్ దొంగిలించిన ఐదుగురిని కొల్లూరు సబ్ స్టేషన్ ప్రాంతంలో అరెస్టు చేయడం జరిగిందని,వీరు పలు కేసులలో సంబంధం ఉందని ఆయన అన్నారు. వారి వద్దనుండి 375 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై దత్తాత్రేయ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు