కాబూల్‌లో మరో ఆత్మాహుతి దాడి

2

కాబూల్‌,జులై 23(జనంసాక్షి):ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో సుమారు 50మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక విూడియా కథనం ప్రకారం కాబూల్లోని దహ్మజంగ్‌  సర్కిల్‌ సవిూపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. కాగా వందల మంది ఓ చోట చేరి నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతంలో బాంబులు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షియా హజారాకు చెందిన వేలాది మంది నిరనస వ్యక్తం చేస్తున్న సమయంలో పేలుళ్లు జరగడంతో 50 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జంట పేలుళ్లు సంభవించడంతో అక్కడి భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముగ్గురు ఆత్మాహుతి దాడి చేసినట్లు తెలుస్తోంది. పేదరికమైన తమ ప్రాంతం నుంచి విద్యుత్‌ లైన్‌ వేయొద్దని షియా హజారా వారు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.