కారు,బైకు ఢీ ఒకరి మృతి

నల్గొండ,ఆగస్టు 30: అర్వపల్లి మండలం తిమ్మాపురం సమీపంలో వేగంగా వెళ్లుతున్న కారు బైక్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తమై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.