కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ  విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న స్వామి (17) అనే విద్యార్థి స్వగ్రామం పోతనపల్లి నుంచి సైకిల్‌పై కళాశాలకు వస్తుండగా జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.