కారు బోల్తా: ఒకరి మృతి
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు గ్రామం వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్ (50) ఆరోగ్యపరీక్షలు చేయించుకొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలు దేరారు. తల్లంపాడు వద్దకు రాగానే కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో అహ్మద్ మృతి చెందగా మిగతా కుటుంబీకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.