కార్డన్‌సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం

నాగర్‌కర్నూల్‌,మే3(జ‌నం సాక్షి):  కొల్లాపూర్‌ ఇందిరా కాలనీలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో 150 పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 85 బైక్‌లు, మరో 8 ఇతర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తుంటే తమకు సమాచారం అందించాలని 
పోలీసులు విజ్ఞప్తి చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నేరాలను ఆరికట్టడానికి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్టు ఎస్‌పి సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ప్రజలు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. సరైన పత్రాలు తీసుకొచ్చి.. వాహనాలను తీసుకెళ్లవచ్చన్నారు.