.కార్డుతో తాగుతున్నారు.

1xziv6fhనల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ళవెల్లంల గ్రామం. ఈ గ్రామంలో తాగేందుకు చుక్కానీరు దొరకదు. అక్కడక్కడ బావుల్లో నీరు ఉన్నా.. ఫ్లోరైడ్ తో కలుషితమయ్యాయి. గుక్కెడు నీటికోసం గ్రామస్థులు నానా తంటాలుపడేవారు. గత్యంతరం లేక ఫ్లోరైడ్ వాటర్ ను తాగుతూ.. ఫ్లోరైడ్ బాధితులుగా మారారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో సీన్ మారింది. మునుపటిలా ఫ్లోరైడ్ వాటర్ తాగడం లేదు. గుక్కెడు నీళ్లకోసం.. పరితపించడంలేదు. తాగేందుకు నీరు కావాలంటే డైరెక్ట్ గా ఏటీఎంకు వెళ్తున్నారు. కార్డుతో తమకు అవసరమున్నన్నీ నీళ్ల ను క్యాన్ లో నింపుకుని వెళ్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన బాల వికాస సాంఘిక సంస్థ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నప్పటి నుండి అసలు మంచినీటి సమస్యే లేకుండా చేసుకున్నారు. స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు.ఇక ఈ వాటర్ ఏటీఎం గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్లీ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ మిషన్. బాల వికా సాంఘిక సంస్థ, ప్రజల సహకారంతో ఈ ప్లాంట్ ను నడిపిస్తున్నారు. స్వచ్చంద సంస్థ ఆలోచనకు.. ఊరి గ్రామస్థులు కూడా తోడయ్యారు. ఇంటికి రెండు వందల చొప్పున సభ్యత్వాన్ని తీసుకొని కొంత మొత్తాన్ని బాలవికాస సంస్థకు అందజేశారు. ఆ డబ్బుతో బాలవికాస స్వచ్చంద సంస్థ ఏటిఎం మిషన్ ను కొనిచింది. నీటిని వృధా చేయకుండా ప్రతి కుటుంబానికి ఒక ఏటీఎం కార్డును అందజేశారు. గ్రామం మొత్తం 530 కార్డులను అందజేశారు. కార్డును కంప్యూటర్ కు అనుసంధానం చేశారు. మిషన్ లో కార్డు పెట్టగానే 20 లీటర్ల నీరు బయటకు వస్తుంది. 20 లీటర్ల క్యాన్ నీటిని కేవలం మూడు రూపాయలకు అందిస్తున్నారు. అంతేకాదు ఈ నీటి ని ఎలాంటి కెమికల్ ను వాడకుండా సహజపద్దతిలో నీటిని శుద్ధి చేస్తున్నారుఒక్కొ కుటుంబానికి వంద రూపాయలతోనే.. నెల మొత్తం నీటిని సరఫరా చేస్తున్నారు. అంతే కాదు ప్రతినెల కార్డును రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. 24గంటలపాటు ఏ సమయంలోనైనా వెళ్లి కంప్యూటర్ లో కార్డును అనుసంధానం చేస్తే 20 లీటర్ల నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా ప్రతినెల కరెంట్ చార్జీలు..మెంటనెన్స్ పోనూ 5వేలు మిగులుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. మిగిలిన డబ్బుతో ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచి.. తాళ్లవెల్లంల గ్రామానికే కాకుండా చుట్టు పక్కలున్న మరో నాలగు గ్రామాల ప్రజలకు ఫ్యరీఫైడ్ వాటర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు బాలవికాస సంస్థ ప్రయాత్నాలు చేస్తోంది. చుట్టు పక్కల గ్రామాల వారికి ఆదర్శంగా నిలిచేలా.. ఈ తాళ్లవెల్లంల గ్రామస్థలు ఎంతో పద్ధతిగా అతి తక్కువ ఖర్చుతో స్వచ్చమైన నీటిని తాగుతున్నారు.

తాజావార్తలు