కార్పొరేట్ తరహాలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తాం

ఫోటో రైట్ అప్ ;చొప్పదండి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి, ఆగస్టు 21 (జనం సాక్షి):
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం చేసే వంద పడకల ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో సకల సౌకర్యాలతో నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వందపడగల ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలీంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఈ ఆసుపత్రిని అప్డేట్ చేయాలని గతంలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి గా అప్డేట్ చేయాలని స్పందించి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసి ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు . వంద పడకల ఆసుపత్రి మంజూరు కావడంతో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణంలో నుతన ఆసుపత్రి కి స్థలాన్ని పరిశీలించమని అన్నారు.వంద పడకల ఆసుపత్రి కి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న స్థలం మూడు ఎకరాల 28 గుంటలు అవసరం ఉందని ఈ స్థలాన్ని అధికారులు పంచనామా చేసి నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు. స్థలాన్ని అధికారులు త్వరగా నిర్ధారణ చేస్తే పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభం చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట సూపర్డెంట్ కృష్ణ ప్రసాద్, మెడికల్ డీఈ వెంకటరమణ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, ఆర్ బి ఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకట రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, యువజన విభాగం నియోజకవర్గం ఇంచార్జ్ బంధారపు అజయ్,
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్, నాయకులు కర్బుజా తిరుపతి గౌడ్, ఏనుగు స్వామి రెడ్డి, మహేశుని మల్లేశం,ఉష్కే మల్ల మధు, గాండ్ల లక్ష్మణ్, దండే కృష్ణ, రావణ్ మల్లేశం తదితరులున్నారు.