కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడుదాం. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత కే గోవర్ధన్ పిలుపు

కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడుదాం.
-సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత కే గోవర్ధన్ పిలుపు

ఖమ్మం. తిరుమలాయపాలెం (సెప్టెంబర్ 25 )జనం సాక్షి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు, కర్షకులు సంఘటితంగా పోరాడాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే గోవర్ధన్ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు పాలేరు లోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రారంభించారు.పార్టీ సబ్ డివిజన్ నాయకులు కే సురేష్ అధ్యక్షుడు జరిగిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద శక్తి రోజు రోజుకు తగ్గుతుందని అయినప్పటికీ ప్రపంచంలో, అనేక దేశాలు అమెరికాతో పోటీ పడుతున్నాయని అన్నారు. 2014 సంవత్సరం నుండి దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చరవేగంగా ప్రజలు అనేక సంవత్సరాలు కష్టపడి సాధించిన ప్రజల సంపదను కారు చౌకగా అమ్ముతున్నారని, 2014 నుండి 2022 వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం ముఖ్యంగా ఆదాని కంపెనీకి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ సముద్ర మార్గం అమ్ముతున్నాడని, లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసి నీ చివరికి రైల్వే లైనులు, అమ్ముతున్నారని ఆయన విమర్శించారు.దేశంలో హిందూ బ్రాహ్మణిజం ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని చర్యలు ముందుకు వస్తున్నాయని, మతం పేరుతో అనేక రాష్ట్రాలలో హిందూ సంస్థలు దళితులపైన ముస్లింల పైన దాడులు చేస్తున్నాయని మహిళల పైన అత్యాచారాలు హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాటలే ఎక్కువ చేతల్లో తక్కువ లాగా ఫోజులు ఇస్తూ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేశాడని ప్రతి మనిషికి రెండు లక్షల రూపాయలు అప్పు ఉన్నాయని, నిత్యవసర వస్తువుల పెరుగుతున్నాయని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను దళిత మూడెకరాల భూమి లేదు, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ రంగం కూడా బాగుపడ్డ తాకలు లేవని దుయ్యబట్టారు. మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగబోతుందని ఇలాంటి ప్రభుత్వాలను ప్రజలు సంఘటితంగా ఉద్యమించి తిరుగుబాటు చేయాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ సబ్ డివిజన్ నాయకులు ఎం గిరి. టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సి బాబురావు, పూర్ణచంద్రరావు, ప్రగశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా నాయకురాలు కోడకoడ్ల కల్పన, ప్రగత శీల యువజన సంఘం పి వై ఎల్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నలగాటి వీరేందర్, నాయకులురవి,దాట్ల నాగేశ్వరరావు, నారపోగు కృష్ణ,పడిశాలగిరి, పెద్దప్రోలు వెంకటేశ్వర్లు, యాకోబు, పోలూరి శ్రీనివాసరావు, శ్రీలత, ఐఎఫ్టియు సురేష్ , తదితరులు పాల్గొన్నారు.