కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): నేడు జరిగే నడిగూడెం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్డులో గల షిరిడి సాయి గోదాం ఏఐటీయూసీ అనుబంధ అమ్మాలి వర్కర్స్ యూనియన్ హమాలీలను కలిసిన అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకి, వలస కార్మికులకు అందరికీ కూడా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. శ్రమని నమ్ముకుని వారు కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారి పిల్లలకు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏఐటీయూసీ మహాసభలో చర్చిస్తుందని కార్మికుల పక్షన ఏఐటియుసి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంకజ్, ప్రదీప్, వీరస్వామి, మంగల్, పూచు గవాస్కర్, చంగోడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.