కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి కార్మికులకు తీరని ద్రోహంచేసిందన్నారు. అయినా సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు వారసత్వ ఉద్యోగాల హావిూని నిలబెట్టారని అన్నారు. తమపై విమర్శలు చేసిన వివిధ కార్మిక సంఘాలు ఇప్పుడు నోరు మూసాయని

అన్నారు. కార్మికుల ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నందుననే తెరాస అనుబంధ సంఘం తెబొగకాసం ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని అన్నారు. మాటలగారడీలు చేసే వామపక్ష

సంఘాలు భూస్థాపితం కాక తప్పదని రుజువయ్యిందని అన్నారు. కార్మికులు కష్టంతో బొగ్గు ఉత్పత్తికి దోహదపడటంతోనే సింగరేణి సంస్థ లాభాలను ఆర్జించిందని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాభాలను బోనస్‌గా ఇచ్చారని గుర్తుచేశారు. ఇటీవల కేసీఆర్‌ సింగరేణి కార్మికులపై కురిపించిన వరాల జల్లుకు జాతీయ సంఘాల మతి పోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో భాగంగా ఐదేళ్ల కాలంలో 25 బొగ్గు గనులను తీసుక వస్తున్నట్లు తెలిపారు. హక్కులను సాధించడంలో ముందున్న తెరాస ప్రభుత్వ అనుబంధ సంఘమైన తెబొగకాసం రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని అన్నారు.

 

తాజావార్తలు