కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు

పానుగల్ నవంబర్ 09 జనంసాక్షి


కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు అన్నారు బుధవారం మండల కేంద్రంలో
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) మండల మహాసభను శేషయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తోందని కార్పోరేట్ కంపెనీలకు కార్మికుల శ్రమను ధారాదత్తం చేస్తోందని ఆయన విమర్శించారు. వెంటనే నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరువేల రూపాయలు ఇవ్వాలని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని స్కీం వర్కర్ల అయినా అంగన్వాడీ ఆశా ఐకేపీ వీవోఏలను కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికుల వలే వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.నవంబర్ 24,25తేదీలలో జరిగే సీఐటీయూ వనపర్తి జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాముడు,ధర్మయ్య,తిరుపతయ్య, నాగయ్య వెంకటస్వామి,రాజగౌడ్ దేవేందర్,బాలకృష్ణ,కిషన్ నాయక్,నాగరాజు, బాబు,రాములు తదితరులు పాల్గొన్నారు.