కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి – మంత్రి జగదీష్ రెడ్డి

 

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): రాష్ట్రంలో
కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం రాత్రి సూర్యాపేట కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతనంగా ఎన్నికైన పాలకవర్గం మంత్రి జగదీష్ రెడ్డి ని హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కలుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రాపర్తి పెద్ద శ్రీనివాస్ గౌడ్ మంత్రికి పుష్పగుచ్చం అందజేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.పీఎస్ఆర్ సెంటర్లోని గీత కార్మికుల భవనం శిథిలావస్థకు చేరిందని గౌడ పెద్దలు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఈ మధ్యకాలంలో తాను గీత కార్మికుల భవన్ పరిశీలనకు వచ్చి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.జిల్లా కేంద్రంలో కాటమయ్య , ఇంద్రవెల్లి ముత్యాలమ్మ , వనమైసమ్మ అమ్మవార్ల ఆలయాలకు ముందు ఆర్చి నిర్మించే విషయమై గతంలోనే హామీ ఇచ్చినందున వాటి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన నిధులను విడుదల చేస్తానని మంత్రి తెలిపారు.కార్మికులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన తన దృష్టికి తీసుకురావాలని పాలకవర్గానికి ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పాలక మండలి సభ్యులు, గౌడ కౌన్సిలర్లు, గౌడ ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు