కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఎన్‌డీఏ

1
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

ఢిల్లీ,డిసెంబర్‌,05(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీపై, భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. కార్మిక చట్టాలను బలహీనం చేస్తున్నారని.. దీంతో కార్మికులు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. వారి తరఫÛన తాను పోరాడతానని పేర్కొన్నారు. ఈరోజు రాహుల్‌ గాంధీ దిల్లీలో కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ విభాగం సమావేశంలో మాట్లాడారు. కార్మికుల తరఫÛన భాజపా, మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కలిసి పోరాటం చేద్దామని సూచించారు. గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలో ఏర్పరిచిన నూతన కార్మిక చట్టాలు పరిశీలిస్తే కార్మికులకు తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయని అన్నారు. కార్మిక చట్టాలను బలహీనం చేయాలని చూస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. కార్మికులు రేపు ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే ఆందోళనలోనే బతుకుతున్నారని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న డెవలప్‌ మెంట్‌, గ్రోత్‌ వంటి పదాల వాటి వెనుక వేరే మర్మం ఉందన్నారు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌. డెవలప్‌ మెంట్‌, గ్రోత్‌, వికాస్‌ వంటివి సామాన్య ప్రజలకు కాదని, కొంతమంది పారిశ్రామిక వేత్తల కోసమన్నారు. కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన 31వ ప్లీనరీలో రాహుల్‌ మాట్లాడారు. భారతీయ కార్మికులను భయపెట్టి పని చేయించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని, అందుకే మేకిన్‌ ఇండియాను ప్రారంభించారన్నారు.