కార్మిక లోకానికి సిఐటియూ అండా దండగా ఉంటుంది రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్

   శివ్వంపేట సెప్టెంబర్ 18 జనంసాక్షి : సుగుణ కార్మిక లోకానికి సిఐటియూ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. శివ్వంపేట మండలం శబాష్ పల్లి పంచాయతీ పరిధిలో గల సుగుణ ఫుడ్స్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్  ఎన్నికలో సీఐటీయూ యూనియన్ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం పరిశ్రమ ఎదుట సిఐటియు  జండా ఆవిష్కరణ చేసి,  కంపెనీ దగ్గర కార్మికులతో సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మల్లికార్జున్ హాజరై మాట్లాడుతూ సిఐటియుపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించినందుకు సుగుణ ఫుడ్స్ డ్రైవర్స్ అలాగే ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులందరికీ  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో కంపెనీ యూనియన్ అధ్యక్షులుగా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కోసం, అదేవిధంగా మెరుగైన వేతన ఒప్పందం కోసం సీఐటీయూ పని చేస్తుందన్నారు. కార్మికుల పక్షాన నిలబడి మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రతల కోసం పని చేసిన చరిత్ర ఉమ్మడి జిల్లాలో సీఐటీయూకి ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గత పూర్వికులు పోరాడి సాధించుకున్న కార్మిక వర్గ హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసే ప్రయత్నాన్ని చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో సుగుణ ఫుడ్స్ డ్రైవర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కంపెనీలో పని చేసే ప్రతి  ఒక్క కార్మికుడి సమస్య కోసం  సీఐటీయూ పని చేయబోతుందని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏ మల్లేష్,  కంపెనీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి, కార్యదర్శి సాయిలు, సుగుణ ఫుడ్స్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఇంద్రేష్, కుమార్, రాజు, షబ్బీర్, యాదగిరి, నాగరాజు,  మల్లగౌడ్, వినయాకుమార్, రవి0ధర్, అరిఫ్, పొచయ్య తదితరులు పాల్గొన్నారు.