కార్మిక హక్కుల కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): కార్మిక హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటే కార్మిక సంఘాలు ఐక్యం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మునగాల మండల కేంద్రంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది
ఈ సందర్భంగా నెమ్మది వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన 8యేండ్ల  కాలంలో కార్మిక చట్టాలను సవరిస్తూ 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లుగా
విభజించి కార్మికులను తీవ్ర నష్టాల్లోకి గురిచేసిందన్నారు.   దేశంలో రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న జీవోలను సైతం రద్దుచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక ఉద్యోగ కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం  సిఐటియు ముందుండి పోరాటం చేస్తుందని, రాబోయే రోజుల్లో ప్రజలు కార్మికులు కలిసి ఐక్య ఉద్యమాలు చేయాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి వెంకటనారాయణ, జిల్లా  సహాయ కార్యదర్శి ఎస్ రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు,  మిట్టగణుపుల ముత్యాలు, బచ్చలకూర స్వరాజ్యం,  మల్లెల వెంకన్న, నీల రామ్మూర్తి,  తదితరులు పాల్గొన్నారు.