కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం
పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు
ఆడపడుచులకు అన్నవలె ముఖ్యమంత్రి కేసీఆర్
ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రేగోడ్ /జనం సాక్షి సెప్టెంబర్30
గడపగడపకు పెద్దకొడుకు వలె పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తూ ఆడపడుచులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం లొనే తెలంగాణ సాంప్రదాయ పండుగలు బతుకమ్మ పండగను అక్క చెల్లెలు ఆనందోత్సవాల నడుమ జరుపుకుంటున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండల కేంద్రమైన జడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణంలో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీరలను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సైతం అందజేశారు.కాగా గతంలో కొత్వాల్ పల్లి గ్రామానికి చెందిన నీరుడి శంకర్ తండ్రి మల్లయ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం ఉన్నందున ఆయన బార్య నీరుడీ నవనీత కు ఎమ్మెల్యే చేతుల మీదుగా 200000/- రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఎమ్మెల్యేకు, బాధిత కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుపేదల అక్క చెల్లెళ్ల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ఇప్పటికి లక్ష 30 వేల ఉద్యోగాలను నియమించగా, మరో 80 వేల ఉద్యోగాలు రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి దేయంగా పనిచేస్తుందని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లక్ష్మణ్. స్థానిక సర్పంచ్ బదనపల్లి నరసింహులు, ఎంపిటిసి గొల్ల నర్సింలు, సర్పంచుల పోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకి రమేష్, పి ఏ సి ఎస్ చైర్మన్ భాస్కరాజు,సర్పచ్చలు కొత్వన్ పల్లి సర్పంచ్ మచ్కురి రవీందర్, సిద్ధారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు వినోద్ కుమార్,రేగోడ్ టీ ఆర్ పార్టీ గ్రామా అధ్యక్షులు రాచోటి సుభాష్ నాయకులు సావూద్ భూమన్న, దేవేందర్, బాబా,గొల్ల క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.