కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
*కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచింతల్ గ్రామానికి చెందిన అర్జున్ అనే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కింద ఇన్సూరెన్స్ లో మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును బుధవారం మైలార్దేవుపల్లి లోని ఎమ్మెల్యే నివాసంలో కుటుంబ సభ్యులకు చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని వారి సంక్షేమానికి కూడా మంత్రి కేటీఆర్ ఆలోచించి ప్రతి ఒక్క కార్యకర్తకు ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించారన్నారు.గతంలో ఏ పార్టీలో కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు అన్నారు. కార్యకర్తల బాగోగులు చూస్తున్న ఘనత టిఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు సతీష్ యాదవ్,రమేష్,నాయకులు నీరటీ రాజు, మోహన్ రావు, సత్యానందం,రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : రోడ్డు ప్రమాదంలో చెందిన టిఆర్ఎస్ కార్యకర్త భార్యకు పార్టీ ఇన్సూరెన్స్ కింద రెండు లక్షల చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
Attachments area