కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంట

.. ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య
… రాజయ్య సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన మహిళలు
స్టేషన్ ఘనపూర్, జూలై 27 , ( జనం సాక్షి) :
నియోజకవర్గమే నా దేవాలయం అని, నియోజక వర్గ ప్రజలే నాకు దేవుళ్ళని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాననిమాజీతొలిఉపముఖ్య మంత్రి, ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజయ్య  సమక్షంలో వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో మేడ స్వామి, కాను గంటి కవిత, తిప్పారపు సమ్మక్క ఆధ్వర్యం లో టిఆర్ఎస్ పార్టీలో 183 మంది మహిళనాయ కులు, మహిళకార్యకర్తలు, మహిళలు టీఆర్ఎస్ లో  చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంఎల్ఏ రాజ య్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్రంలో సీఎం  కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలకు,దళితుల సమగ్రాభివృద్ధికోసం తీసుకువచ్చిన దళితబంధు పథమునకు  ఆకర్షి తులై పార్టీలో చేరారనీ అన్నారు. భారతదేశంలో ని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా జరుగని అభివృద్ధి ఒక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని తెలిపారు. తెలం గాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను చూసి వాటికి ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళితబం ధు పథకానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన మహిళనాయకులు,మహిళ  కార్యకర్తలు, టిఆర్ ఎస్ పార్టీలో చేరారని అన్నారు. గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి సాధించడానికి ప్రపంచంలోనే వినూత్నమైన కార్యక్రమం పల్లెప్రగతి, రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు , గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే రైతుబీమా , 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, పేదిం టిఆడపిల్ల పెళ్లి కానుకగా కల్యాణ లక్ష్మి , షాదీము బారక్ పథకాలద్వారా1లక్ష116అందజేయడం,
కేసిఆర్ కిట్టు,తెలంగాణ రాష్ట్రంలో చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 976 రెసిడెన్షియల్ పాఠశాలలు నడు పుతూ ఒక్కొక్క విద్యార్థి మీద లక్షా 20 వేలరూపా యలు ఖర్చు చేస్తూ నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య, కూడ అడ్వయీజరి కమి టీ సభ్యుడు ఆకుల కుమార్, సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు,దయాకర్,రాజు, నాగేందర్, ఏసుబాబు, ప్రసాద్, మల్లేష్, అశోక్, మహేష్  ప్రజాప్ర తినిధులు,ముఖ్య  నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.