కార్యకర్తల బాగోగులు చూసుకుంటాం
డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి
చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): భారతీయ రాష్ట్ర సమితి చౌడపూర్ మండల ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నర్సింలు ఇటీవల అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత డిసిసిబి చైర్మన్ బి.మనోహర్ రెడ్డి పరామర్శించి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటూ వారి యొక్క బాగోగులు చూసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శారదమ్మ,మాజీ సర్పంచ్ కృష్ణయ్య,మొగులయ్య,రామ్ లాల్,వెంకటేష్,కొండన్న మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area