స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి

 

 

 

-సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సంప్రీత్ సింగ్

వర్ధన్నపేట,ఏప్రిల్ 4( జనం సాక్షి):

ఐనవోలు మండలం పున్నేలులో మానవత్వాన్ని మరిచిన దారుణ ఘటన చోటుచేసుకుంది.మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానం,అబార్షన్‌కు భార్య అంగీకరించలేదనే కోపంతో భర్త అజారుద్దీన్ ఘాతుకానికి పాల్పడినట్లుతెలుస్తోంది.మూడునెలల గర్భిణిగా ఉన్న భార్యను,తన ఇద్దరు కుమార్తెలను సొంత స్విమ్మింగ్ పూల్‌లో తోసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంచేసినట్లుసమాచారం.ఈ దారుణానికి పాల్పడే ముందు స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ఆఫ్ చేసి,ముందస్తు ప్రణాళికతో నేరానికి దిగినట్లు పోలీసులుఅనుమానిస్తున్నారు.భర్త అజారుద్దీన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇక మృతురాలి బంధువులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో పున్నేలు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.అలాగే ఈ కేసులో లింగ నిర్ధారణ చేసిన వైద్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
-ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
తల్లి,ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సిపి సంప్రీత్ సింగ్ తీవ్రంగా పరిగణించారు. ఆయన నేరుగా ఘటన స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,ఇతర అధికారులతో కలిసి కేసు దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకొని మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి, త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని అధికారులను సిపి ఆదేశించారు.