కాలూరి మల్లికార్జున చారిని సన్మానించిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కార్యవర్గం.
జనగామ (జనం సాక్షి) అక్టోబర్08:తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం హైదరాబాద్ బొజ్జ జనసేన హాల్లో జరిగినది, ఈ సమావేశంలో జనగామ జిల్లా అధ్యక్షులు నారోజు రామేశ్వరాచారి, ప్రధాన కార్యదర్శి మల్లోజు గిరిబాబు చారి, ఆధ్వర్యంలో జనగామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలూరి మల్లికార్జున చారిని, రాష్ట్ర అధ్యక్షుల వారిచే జనగామ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘంలో కీలకపాత్ర వహిస్తూ, చురుకుగా పనిచేస్తున్నందున, జనగామ జిల్లా కోశాధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించి సన్మానించారు. ఈ సందర్భంగా కాలూరి మల్లికార్జున చారి మాట్లాడుతూనా పై నమ్మకం తో పదవి ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి , జనగామ జిల్లా అధ్యక్షులు నా రోజు రామేశ్వర చారి, ప్రధాన కార్యదర్శి మల్లోజు గిరిబాబు, జనగామ మండల అధ్యక్షులు ముమ్మాడి నరసింహ చారి, ప్రధాన కార్యదర్శి మైలారం దామోదర్ చారి, జనగామ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లోజు కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు పడకంటి రామ సొఖంచారి, తెలంగాణ అన్ని జిల్లాల ప్రతినిధులు మరియు రాష్ట్రంలోని సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు,