కాళేశ్వరానికి భక్తుల తాకిడి
కాళేశ్వరం,ఆగస్ట్17(జనం సాక్షి): కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందడి కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తుల రాకపెరుగుతోంది. ఈ సందర్భంగా స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం సందర్శనకు వచ్చే వారు సైతం దర్శనానికి వస్తున్నారు. ఉదయం నుంచే త్రివేణి సంగమం గోదావరి నది పుష్కరఘాట్ తీరంలో భక్తులు స్నానా లు చేసి, నదీమాతల్లికి తర్పణాలు వదిలారు. దీపాలు వెలిగించి, హారతులిచ్చారు. గర్భలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. తులసి చెట్లు వద్ద దీపాలు వెలిగించారు.