కావాలనే కొన్ని వర్గాలపై దాడులు

5

– అసహనంతో రాజ్యాంగ మూలసూత్రాలకు ప్రమాదం

– సోనియా

ఢిల్లీ నవంబర్‌26(జనంసాక్షి):

కావాలనే కొన్ని వర్గాలపై మతోన్మాద శక్తులు దాడులు చేస్తున్నాయని పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. దేశంలో పెరుగుతున్న అసహనం మూలంగా రాజ్యాంగ భావాలు, సూత్రాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్డీయే పాలనలో రాజ్యాంగాన్ని అవమానపరచడం సాధారణంగా మారిందన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేనటువంటి, రాజ్యంగ రూపకల్పనలో పాలు పంచుకోనివారు ప్రస్తుతం రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎన్నికైన అనంతరం దానిపైనే అభ్యంతరాలు తెలుపుతున్నారని విమర్శించారు. ఇప్పడు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ అమలుకు ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో ఉందంటూ పేర్కొనడం కన్నా పెద్ద

జోక్‌ ఇంకొకటి లేదన్నారు. దేశంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఘటనలు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఆమె అసహనంపై మాట్లాడారు. దేశ స్వాంతత్య్ర పోరాటంలో, రాజ్యాంగ రచనలో కాంగ్రెస్‌ కృషిని ఈ సంద

ర్భంగా సోనియా గుర్తుచేశారు.