కావేరీ జలాలను విడుదల చేస్తాం

05-oct-03
– సుప్రీంకు కర్ణాటక నివేదన

బెంగళూరు,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రానికి కావేరి నీటిని విడుదల చేస్తున్నామని కర్ణాటక సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈనెల 1 నుంచి 6 వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. రోజుకు 6వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు విన్నవించింది. కోర్టు ఆదేశాలను కర్ణాటక ధిక్కరి స్తోందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన అనంతరం మంగళవారం నీరు విడుదల చేస్తున్నామని కర్ణాటక చెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని వెల్లడించింది. తంలో సుప్రీంకోర్టు తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కులు విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ కర్ణాటక నీటిని విడుదల చేయని సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మంగళవారం 2గం.లోగా తమిళనాడుకు నీళ్లు ఇస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు నిన్న కర్ణాటకను ఆదేశించింది. ఈ మేరకు నేటి విచారణలో నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇన్ని రోజులు కావేరీ నదిలో నీటి లభ్యత తక్కువగా ఉందని కర్ణాటక వెల్లడించింది. తాజాగా కురిసిన వర్షాల వల్ల నీరు పెరగడంతో తమిళనాడుకు నీళ్లు ఇస్తున్నట్లు తెలిపింది.