కాశ్మీర్‌లో నెహ్రూ విధనాలే దెబ్బతీసాయి: స్వామి

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌/-లో నెహ్రూ అనుసరించిన విధానాలే దెబ్బతీసాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్‌స్వామి అభిప్రాయపడ్డారు. అక్కడ ఓ ఓ హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్‌స్వామి అన్నారు. కశ్మీర్‌కు కేవలం ముస్లింలనే సీఎం చేయాలని నిబంధన విధించిన మాజీ ప్రధాని జవర్‌లాల్‌ నెహ్రూ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. జమ్మూకశ్మీర్‌కు ఓ హిందూ మతస్థుడు సీఎం కావాలని, ఒకవేళ పీడీపీ పార్టీలో ఎవరైనా హిందువు లేదా సిక్కు వ్యక్తి ఉన్నా వారిని సీఎంగా చేయాలని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ విధించిన నిబంధన సహించలేమన్నారు. ఆర్థిక అభివృద్ధినినాదం బీజేపీకి విజయాన్ని అందించదని, హిందుత్వ ఎజెండా మాత్రమే ఆ పార్టీని ఆదుకుంటుందన్నారు. వాజ్‌పేయి చేపట్టిన ఇండియా షైనింగ్‌ ప్రచారం బీజేపీని దారుణంగా దెబ్బతీసిందని ఆయన గుర్తు చేశారు. హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అందుకే 2014లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. ముంబైలో విరాట్‌ హిందుస్థాన్‌ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మరో అయిదేళ్ల అధికారం ఇస్తే, తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.