కాశ్మీర్‌లో ముగ్గురు ముష్కరుల హతం


మట్టుపెట్టిన భద్రతా బలగాలు
శ్రీనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి.
ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడిరచారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఇదిలావుంటే పంజాబ్‌లో అమృత్‌సర్‌ జిల్లాలోని పాక్‌ సరిహద్దులో భారీగా మాదకద్రవ్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రూ.200కోట్ల విలువైన 40.810 కిలోల హెరాయిన్‌ను పట్టుబడిరది. శనివారం తెల్లవారు జామున గుల్నీత్‌ ఖురానా నేతృత్వంలో బోర్డ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, స్థానిక పోలీసుల
బృందం రామదాస్‌ సెక్టార్‌లో సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి 40 కిలోలకు పైగా హెరాయిన్‌ రికవరీ చేసుకున్నట్టు డీజీపీ దినకర్‌ గుప్తా ట్విట్‌ చేశారు.ఈ ఆపరేషన్‌లో పంజ్‌గ్రేయన్‌ ప్రాంతం నుంచి 90 గ్రాముల ఓపియమ్‌, రెండు ఎª`లాస్టిక్‌ పైపులను స్వాధీనం చేసుకున్నారని అమృత్‌సర్‌ రూరల్‌ ఎస్‌ఎస్‌పీ పేర్కొన్నారు.

తాజావార్తలు