కాశ్మీర్‌లో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తాం

3

-హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌

శ్రీనగర్‌,జులై 24(జనంసాక్షి):కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కశ్మీర్‌ అంశంలో మూడోపక్షం జోక్యం అవసరం లేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆయన వరుసగా రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటించి పరిస్థితులపై సవిూక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాద అంశంలో పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. కశ్మీర్‌ అంశంలో పాకిస్థాన్‌ పాత్ర స్వచ్ఛంగా లేదన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పరిస్థితులను పూర్తిగా అదుపు చేసి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

కాశ్మీర్‌ కు కేంద్రం అండగా ఉంటుంది కాశ్మీర్‌ లో 2 రోజుల పర్యటనను కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ పూర్తి చేశారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు.. మంత్రులు, పీడీపీ, బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఎం నేతలతో సమావేశమయ్యారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీ ఎన్‌ కౌంటర్‌ తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణాలపై చర్చించారు. కాశ్మీర్‌ కు కేంద్రం అండగా ఉంటుందన్న రాజ్‌ నాథ్‌.. ముందు రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. గొడవల్లో గాయపడిన వారిని అవసరమైతే.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లి ఎయిమ్స్‌ లో చికిత్స చేయిస్తామని చెప్పారు. ప్రధాని మోడీ కూడా.. కాశ్మీర్‌ పరిస్థితిపై రెగ్యులర్‌ గా తనతో మాట్లాడుతున్నారన్నారు.కాశ్మీర్‌ లో శాంతి స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయన్నారు.. సీఎం ముఫ్తీ. రాష్ట్రంలో గొడవలపై.. రాజ్‌ నాథ్‌ తో చర్చించినట్టు చెప్పారు. ఉద్రిక్తతలను కంట్రోల్‌ చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.. మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా. రాజ్‌ నాథ్‌ తో సమావేశానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంది. 16 రోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. ఇంకా కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని.. రాజ్‌ నాథ్‌ టూర్‌ తో వచ్చే లాభం లేదని కామెంట్‌ చేసింది. మరోవైపు.. భద్రత విషయంలో ముఫ్తీ ప్రభుత్వం ఫెయిలైందని నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ విమర్శించింది.దాదాపు అన్ని పార్టీలతో సమావేశమైన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌.. ఎవరూ టెన్షన్‌ పడొద్దని పిలుపునిచ్చారు. కాశ్మీర్‌ లో ప్రశాంతత కోసం కేంద్రం ఫస్ట్‌ ప్రియారిటీ ఇస్తోందన్నారు.