కాశ్మీర్‌ ఆందోళనల వెనక పాక్‌ హస్తం

1

– రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,జులై 21(జనంసాక్షి): కశ్మీర్‌ అల్లర్ల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ మరోమారు పునరుద్ఘాటించారు. పాక్‌ అక్కడ యువతను రెచ్చగొట్టేలా చర్యలు చేస్తోందని అన్నారు. గురువారం లోక్‌ సభలో కశ్మీర్‌ అల్లర్లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజ్‌ నాథ్‌ వివరణ ఇస్తూ భారత్‌కు  కశ్మీర్‌ కిరీటం వంటిదని అన్నారు. కశ్మీర్‌ అల్లర్లపై చర్చ జరగడం అనేది చాలా అవసరం, ముఖ్యమైనది కూడా అని చెప్పారు.  లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థల ప్రమేయం ఈ అల్లర్ల వెనుక ఉందని చెప్పారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణమైన బృహాన్‌ మనీ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ కమాండర్‌ గా పనిచేశాడని అన్నారు. సోషల్‌ విూడియా ద్వారా కశ్మీర్‌ యువకులను రెచ్చగొట్టారని అన్నారు. భారత్‌ లోని ముస్లింల గురించి పాకిస్థాన్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కశ్మీర్‌ విషయంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా భారత మాజీ ప్రధాని వాజ్‌ పేయి వినిపించిన కవితను రాజ్‌ నాథ్‌ వినిపించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలం అని చెప్పారు. మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము శాయశక్తులు కృషి చేస్తున్నామని అన్నారు. కశ్మీర్‌ పరిస్థితిని చక్కదిద్దుతాం అని హావిూ ఇచ్చారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు ప్రశ్నోత్తరాల తర్వాత లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌  కశ్మీర్‌ అంశంపై చర్చకు అనుమతించారు. కశ్మీర్‌లో అల్లర్లపై ప్రధాని మోదీ సునిశితంగా పరిశీలిస్తున్నారని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడూ కశ్మీర్‌లో పరిస్థితిపై ఆందోళన చెందారని గుర్తు చేశారు. భారత్‌ను నిరంతరం అస్థిరపరిచేందుకే పాక్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కశ్మీర్‌లో అల్లర్లను పాకిస్థానే ఎగదోస్తోందని స్పష్టం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల ప్రత్యేకత అని, కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. కశ్మీర్‌ పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు.