కాశ్మీర్‌ విమానాశ్రయానికి మహారాజా పేరు

ప్రధానికి కరణం సింగ్‌ లేఖ

న్యూఢిల్లీ,జూలై10(జ‌నం సాక్షి ): జమ్మూకశ్మీర్‌ విమానాశ్రయానికి పేరు మార్చి మహారాజా హరి సింగ్‌ పేరు పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ ప్రధాని మోదీని మంగళవారంనాడు కోరారు. ఈ మేరకు మోదీకి ఆయన లేఖ రాశారు. కరణ్‌సింగ్‌ మహారాజ సింగ్‌ వంశానికి చెందినవాడే కావడం విశేషం. మహారాజా హరి సింగ్‌ సమయంలోనే విమానాశ్రయ నిర్మాణం జరిగి రాష్ట్రం నుంచి తొలి విమానం నడిచింది. ఆయన పేరే విమానాశ్రయానికి పెట్టాలని జమ్మూకశ్మీర్‌ ప్రజలు చిరకాలంగా కోరుతున్నారు’ అని ఆ లేఖలో కరణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు సామాజిక సంక్షేమ, అభివృద్ధి చర్యలు చేపట్టి, 1947 అక్టోబర్‌ 26 విలీనానికి సంతకం చేయడంలో మహారాజా హరి సింగ్‌ కీలక పాత్ర పోషించారని కరణ్‌ సింగ్‌ గుర్తుచేశారు. మరో రెండు రోజుల్లో త్రిపురలోని అగర్తాలా ఎయిర్‌పోర్ట్‌ పేరును మహారాజా వీర్‌ విక్రమ్‌ కిషోర్‌గా కేంద్ర మార్చనున్న తరుణంలో కరణ్‌ సింగ్‌ తాజా ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ సిటీ పేరును ప్రయాగగా మార్చేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ స్వామి కోరారు.