కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీని వీడిన ఆపార్టీ నేత కడియం శ్రీహరి కాసేపట్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. కడియం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. కాగా, ఇప్పటికే యాబైవేల మంది కార్యకర్తలతో కడియం ఘన్‌పూర్‌ నుంచి ర్యాలీగా హైదరాబాద్‌కు బయలుదేరారు.