కాసేపట్లో సంతోష్ అంతిమయాత్ర ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన విద్యార్ధి సంతోష్ అంతిమయాత్ర కాసేపట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సంతోష్ తల్లిదండ్రులు వర్సీటీకి చేరుకున్నారు. కాగా, సంతోష్ ఆత్మహత్యపై తెలంగాణ న్యాయవాదుల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.