కిరణ్‌ తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

కరీంనగర్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్‌ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్‌ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణవాదులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మంచిర్యాలలో దళిత ఎమ్మెల్యేను సీఎం అవమానపరిచారని గుర్తు చేశారు. సీఎం కిరణ్‌ తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు.