కిరణ్, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ
ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని అరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషోర్ చంద్ర దేవ్ లేఖ రాసినట్టుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కిషోర్ చంద్రదేవ్‌తన లేఖలో బొత్స కిరణ్‌లపై తీవ్రమైన విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది. కిరణ్ ఓ అసమర్ధ నేత అని లేఖలో పేర్కోన్నారు.
బొత్సను కూడా అసమర్థ నేతగా పేర్కెంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అయనను లిక్కర్ డాన్, మైనింగ్ మాఫియా ల్యాండు మాఫియా అంటూ పేర్కోన్నట్టుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌ను, పిసిసి చీఫ్‌గా బొత్సను వెంటనే తప్పించాలని అయన తన లేఖలో సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది.
వారిని తోలగిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలపడుతుందని. లేదంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పేర్కోన్నారని సమాచారం. సాదారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి స్థానంలో పగ్గాలను ఇతరులకు అప్పగించాలని సూచించారని. తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాయకత్వ మార్పులపై జోరుగా ఊహగానాలు చేలరేగుతున్న తరుణంలో కిషోర్ చంద్రదేవ్ లేఖ కలకలం రేపుతోంది.