*కిరణ్ ఆకస్మిక మరణం సీపీఎం పార్టీకి తీరని లోటు*

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ

మునగాల, జూలై 13(జనంసాక్షి): మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ కార్యకర్త సోమపంగు కిరణ్ మరణం గ్రామ సీపీఎం పార్టీకి తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మీ అన్నారు. బుధవారం నర్సింహులగూడెంలో కిరణ్ భార్య, పిల్లలను, తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి జోహర్లార్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ, నర్సింహులగూడెం గ్రామంలో పార్టీ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరవీరుల స్పూర్తితో కిరణ్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశాడని పేర్కొన్నారు. గ్రామంలో సీపీఎం పార్టీ చురుకైన కార్యకర్త పని చేస్తూ ఎన్నికలు, పార్టీ సమావేశాల సందర్భంగా జన సమీకరణలో కీలక పాత్ర పోషించారని అన్నారు. విద్యార్థి రంగం ఎస్ఎఫ్ఐలో పని చేసి విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేశాడని తెలిపారు. కెవిపిఎస్ లో పని చేస్తూ దళితుల సమస్యలపై పోరాడుతున్న సందర్భంలో అకస్మాత్తుగా మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి సీపీఎం జిల్లా, రాష్ట్ర పార్టీ పక్షంగా సంతాపం సానుభూతి తెలిపి ధైర్యంగా ఉండాలని తెలిపారు. పరామర్శించిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలుగూరి జ్యోతి, మేకనబోయిన సైదమ్మ, సీపీఎం అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ, మండల కమిటీ సభ్యులు జూలకంటి కొండారెడ్డి, నందిపాటి వెంకయ్య, శాఖ కార్యదర్శులు మారం వెంకటరెడ్డి, ఉయ్యాల కొండయ్య, మారం ఉదయమ్మ, వార్డు మెంబర్స్ ఉయ్యాల పావని, జూలకంటి కరుణాకర్ రెడ్డి గ్రామ నాయకులు సోమపంగు గురువయ్య, కాంపాటి అచ్చయ్య, సోమపంగు వెంకటేశ్వర్లు, సోమపంగు రమేష్, ఈదయ్య, గామయ్య, పోకల వెంకన్న, మొగిలిచెర్ల సీతారాములు, ఎలుగురి వెంకన్న, తోట సోమయ్య తదితరులు పాల్గొన్నారు.