కివి పాఠశాలలో ఘనంగా మాతృభాషా దినోత్సవం గిడుగు రామ మూర్తి జన్మదినం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29 (జనం సాక్షి) మాతృభాషా దినోత్సవాన్ని కరీమాబాద్ కివి పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు భాష అనేది ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలని వాళ్లకి అందరికీ అర్థమయ్యే రీతిలో రాయగలగాలని అందుకే వాడుక భాష చాలా అవసరమని గిడుగు రామమూర్తి గారు భావించారు, ఆయన తెలుగు భాషకు చేసినటువంటి విశిష్ట సేవకి చిహ్నంగా వారి జన్మదినం అయినటువంటి ఆగస్టు 29 ని మాతృభాష దినోత్సవం గా జరుపుకుంటామని ఈ సందర్భంలో విద్యార్థినీ విద్యార్థులకు ప్రిన్సిపల్ దాసి సతీష్ మూర్తి గారు వివరించారు , మరియు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాషకు సాటి రాదని మరియు ఆ భాషలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మన భాషలోకి మార్చుకొని ప్రపంచ పటం లో మన భాషను నిలబెట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్ పాఠశాల డైరెక్టర్ దాసి రజిని తెలుగు ఉపాధ్యాయులు శాంతకుమారి మరియు శీను ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.