కీచక ప్రధానోపాధ్యాయిని పై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి-

-ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 23 (జనం సాక్షి);
ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునీగా పనిచేస్తూ పిల్లలకు విద్యా,బుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు మైనర్ దళిత అమ్మాయిపై కన్ను వేసి అత్యాచారం చేయబోయిన అతనిపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న తెలిపారు.
ఈ సంఘటన ఏదో మారుమూర గ్రామంలో కాదు 44వ జాతీయ రహదారి పక్కనే జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పోలీసు బెటాలియన్ లో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఇలాంటి పనికి ఒడిగట్టుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరముల వజ్రా ఉత్సవాలు ముగింపు కాకముందే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశానికే సిగ్గుచేటని ఒకపక్క ప్రభుత్వం వజ్రోత్సవాల జరుపుకుంటున్న మరో ప్రక్క ఇలాంటి సంఘటనలు చేయడం అందుకు అక్కడున్న ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ ప్రధానోపాధ్యాయునికి వత్తాసు పలికి సోమవారం జరిగిన సంఘటనను బయటకు పోక్కనీయకుండా ధన, అధికార, పోలీసు అహంకారంతో గతంలో ఇట్లా చేసిన సంఘటనలు ఆ ప్రధానోపాధ్యాయునికి ఉన్నాయని అతనిపై జిల్లా కలెక్టర్,ఎస్పీ,డీఈవో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కొంకల భీమన్న అన్నారు. ఈ విషయంపై జోగులాంబ గద్వాల జిల్లా డీఈవో సిరాజుద్దీన్ ను వివరణ కోరగా ఎర్రవల్లి చౌరస్తా లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చిందని ఈ విషయంపై ఇటిక్యాల ఎంఈఓ ను విచారణకు ఆదేశించామని విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని ఆయన అన్నారు.