కీతవారిగూడెంలో సర్వ సభ్య సమావేశం
ప్రశ్నించిన వారిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి): మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నందు సర్వ సభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ ముప్పారపు రామయ్య అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో కొత్తగా గోదాం నిర్మాణం చేయడం జరిగిందన్నారు. నిర్మాణం పూర్తయిన గోదాం ను మంచి రోజు చూసుకొని ప్రారంభించుకుందామని చెప్పడం జరిగిందన్నారు. అదే విధంగా రైతులకు సకాలంలో ఎరువులు అందించడం జరుగుతుందన్నారు.సొసైటీ లాభాలలో రావాలని అందుకు డ్రై మిషన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని దాని వలన రైతులకు లాభం జరుగుతుందన్నారు. అందువలన డ్రై మిషన్ ఏర్పాటుకు ఈ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు.ఈ తీర్మాణం డి.సి.ఓ సూర్యాపేట కి సమర్పించాలని ఈ సమావేశంలో చెప్పారన్నారు.ఈ విధంగా పక్షపాతంతో సభ్యత్వం తొలిగించడం జరిగిందని అది కూడా కొత్తగూడెం గ్రామనిదే అని మాజీ డైరెక్టర్ దొంతిరెడ్డి బిక్షంరెడ్డి ఈ సమావేశంలో చైర్మన్ ని ప్రశ్నించడం జరిగిందని ఆరోపించారు. అది కూడా పక్షపాతంతో కేవలం కాంగ్రెస్ పార్టీ వారి సభ్యత్వం తొలిగించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. బోగస్ సభ్యత్వం ఉంటే అన్ని వార్డులలో సభ్యత్వం తొలిగించాలని ఈ సమావేశంలో మాజీ డైరెక్టర్ దొంతిరెడ్డి బిక్షంరెడ్డి అన్నారు. అదే విధంగా రేగులగడ్డతండా గ్రామంలో గోదాం కొరకు 2021 సంవత్సరంలో తీర్మాణం చెయ్యడం జరిగింది కానీ ఇప్పటి ఆ తీర్మాణం ను పట్టించుకోకుండా వదిలెయ్యడం జరిగిందని ఆరోపించారు. చేసిన తీర్మాణం ను ఎందుకు అమలు చెయ్యడం లేదని డైరెక్టర్ బాణోతు సైదులు నాయక్ చైర్మన్ ను ప్రశ్నించారు. అదే విధంగా డైరెక్టర్ బాణోతు సైదులు నాయక్ ఈ సమావేశం లో కొన్ని ప్రశ్నలను అడగడం జరిగిందన్నారు. 2019-2020 సంవత్సరానికి సంబంధించి 3% వడ్డీ రాయితీ ఎంత వచ్చింది ? రైతుల ఖాతాలో జమ అయినాయా లేదా అని అడిగిన దానికి సి.ఇ.ఓ కాట్రేవుల లక్ష్మయ్య అవి సొసైటీ ఖాతాలో ఉన్నాయి పై అధికారులతో మాట్లాడి రైతుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయిస్తా అని తెలిపారు. 2022 మార్చి నెలలో జనరల్ బాడీ ఖర్చు 30,000 రూపాయలు ఎలా అయ్యిందని ప్రశ్నించారు.చైర్మన్, సి.ఇ.ఓ ఏలాంటి సమాధానం చెప్పలేకపోయారని వారు ఆరోపించారు. కొత్తగా కట్టిన గోదాం యమ్.బి, బిల్డింగ్ ప్లాన్ అడిగితే ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. చైర్మన్, సీ.ఇ.ఓ ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని ఎందుకు ఇవ్వట్లేదని సర్వ సభ్య సమావేశంలో డైరెక్టర్ బాణోతు సైదులు నాయక్ ప్రశ్నించడం జరిగిందన్నారు. అదే విధంగా చైర్మన్,సి.ఇ. ఓ లకు అనుకూలమైన రైతులు అప్పు ఉన్న రైతులు వస్తే వారికి అప్పు ఉన్న కూడా లేదని నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని డైరెక్టర్ బాణోతు సైదులు నాయక్ సర్వ సభ్య సమావేశంలో అందరికి తెలియజేయడం జరిగిందన్నారు. దానికి చైర్మన్ ,సి.ఇ.ఓ లు ఎలాంటి స్పందన ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో ఛైర్మన్ ముప్పారపు రామయ్య, వైస్ చైర్మన్ పోలేపల్లి రామనాధం, సి.ఇ. ఓ కాట్రేవుల లక్ష్మయ్య, డైరెక్టర్ లు బాణోతు సైదులు నాయక్,వెంకటేశ్వర్లు, వీరస్వామి,కృష్ణ,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.