కీసరకు పోటెత్తిన భక్తులు

రంగారెడ్డి,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): శివరాత్రి జాతరను పురస్కరించుకొని తండోపతండాలుగా కీసరకు భారీగా జనం తరలివచ్చారు. జిల్లాతో పాటు నగరం, వివిధ జిల్లాల నుంచి భక్తులు పిల్లా పాపలతో తరలివచ్చి, రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసర ప్రాంతాలన్ని జనారణ్యంగా మారిపోయాయి. శివనామ స్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది.  రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో జాతర సందర్భంగా మూడో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ¬మం, బిల్వార్చన, ప్రదోషకాలపూజ, హారతి, మంత్రపుష్పం తదితర పూజాధికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కీసరగుట్ట వేదపాఠశాలకు చెందిన విద్యార్థులు వేద పఠనం చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.జాతర సందర్భంగా ప్రతి ఏటా మహాశివరాత్రికి ముందు రోజు నగరంలోని కందిగూడ, బొల్లారం, అమ్ముగూడ గ్రామాల నుంచి భక్తులు ఎడ్ల బండ్ల విూద కీసరగుట్టకు విచ్చేసి మూడు రోజుల పాటు ఇక్కడనే గడిపి వెళ్తారు. చాలా ఏళ్ల నుంచి వారు ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఆ గ్రామాల ప్రజలు సోమవారం కీసరకు ఎడ్ల బండ్లలో చేరుకున్నారు.  కీసర బ్ర¬్మత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రజత్‌కుమార్‌ సైనీ ఒక ప్రకటనలో తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యంతోపాటు వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని, భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 18న చిందు యక్షగానంతో పాటు భక్తిగీతాలు, శివపురాణం, భాగవతం కార్యక్రమాలను

నిర్వహించనున్నట్లు జేసీ రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.