కీసరగుట్టతో పాలు పలు ఆలయాల్లో శివరాత్రి శోభ

రంగారెడ్డి,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): రంగారెడ్డి జిల్లాలో కీసరతో సహా పలు ఆలయాలు శివరాత్రి వేడుకలకు సి/-దం అయ్యాయి. సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధనాంగా ప్రతియేటా జంటనగరాల నుంచి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు.  ఆలయ ముఖ మండపంలో గణపతి పూజ నిర్వహించి బ్ర¬్మత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు.  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా బ్ర¬్మత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బ్ర¬్మత్సవ పూజలను కనులారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్ర¬్మత్సవ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే

నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ పార్వతీపరమేశ్వరుల ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబదింది. ఏటా శివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ ఏడాది భక్తుల తాడికి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున్న ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతంగా ఉన్న అనంతగిరి కొండలకు నెలవైన వికారాబాద్‌ నియోజకవర్గలో శివరాత్రి ఏర్పాట్లు  పూర్తయ్యాయి.  భక్తులు జాగారం, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వికారాబాద్‌ పట్టణంలోని మల్లికార్జున గుడి, అనంతగిరి సవిూపంలోని బుగ్గరామేశ్వరం, మండల పరిధిలోని పరమేశ్వరుని గుట్టలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగేపలు శివాలయాల్లోనూ అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. బషీరాబాద్‌ మండలం ఆటవీప్రాంతంలో వెలసిన ఏకాంబర రామలింగేశ్వరాలయం, జీవన్గీ మహాదేవ లింగేశ్వరాలయం, కాగ్నానది తీరాన వెలసిన నవాంద్గీ

సంగమేశ్వరాలయాల్లో శివరాత్రి రోజు భక్తుల దర్శనం, ఉపవాస దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్ణాటక సరిహద్దు జీవన్గీ కాగ్నానది మధ్యలో మహాదేవ లింగేశ్వరాలయం నెలకొంది. శివరాత్రికి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని  శివాలయాలు శివరాత్రికి ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి.  పరిగిలోని అనంతరెడ్డికాలనీ శివాలయంలో ఉపవాస దీక్షలను విరమించే భక్తుల కోసం ప్రత్యేకంగా అల్పాహారాన్ని తయారు చేయనున్నారు.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శివాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.