కుండపోత వర్షంలో లీక్వాన్‌ యు కు కన్నీటి వీడ్కోలు

3A

3B
అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ

సింగపూర్‌్‌,మార్చి 30(జనంసాక్షి) : సింగపూర్‌ జాతిపితగా ఖ్యాతిగాంచిన సింగపూర్‌ వ్యవస్థాపకుడు, సింగపూర్‌ మాజీ ప్రధాని  లీ క్వాన్‌ అంతిమ సంస్కారాలు ఘనంగా ముగిశాయి. సింగపూర్‌ ప్రజలు కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 15 కి.మీ. మేర వేలాదిగా బారులు తీరి తమ ప్రియతమ నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. నిబద్ధత, చిత్తశుద్ధికి మారుపేరైన లీ పేద రైతు కుటుంబంలో పుట్టి దేశ ప్రదానిగా ఎదిగారు. సింగపూర్‌ వ్యవస్థాపకుడైన 91 ఏళ్ల లీ క్వాన్‌ యూ అంత్యక్రియలను ఆదివారం సింగపూర్‌ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లీ క్వాన్‌ భారతదేశంలో పలుమార్లు పర్యటించారు.