కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ది

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: చారి
హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టిఆర్‌ఎస్‌ ప్రతినిధులను గ్రామాల్లో ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్‌ను  విమర్శించే స్థాయి లేదన్నారు. కోట్లాది ఆస్తులకు వారసురాలైన కాంగ్రెస్‌ నాయకురాలు అవినీతి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లలో అభివృద్ధికి  వేల కోట్ల నిధులు ఖర్చు చేసిన ఘనత తమ ప్రబుత్వానిదని  అన్నారు. ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయ పబ్బం గడుపుకునేందుకే వారు తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలు నమ్మకుండా అభివృద్ధిని కోరుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు మహిళలంటే ఎంతో గౌరవమని, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నారన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేసి రూ.1,00, 116 ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైతే ఆడపిల్లకు రూ.13వేలు, మగబిడ్డకు రూ.12వేల ఆర్థిక సాయంతో పాటు విలువైన వస్తువులు గల కేసీఆర్‌ కిట్లను అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని చారి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పె ట్టిందని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణ కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతు బీమా పథకంతో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే బృహత్తర కార్యక్రమా న్ని చేపట్టామన్నారు. పేదింటి ఆడపడుచు ల పెళ్లీళ్ల కోసం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి రూ.1,00,116 ఆర్థిక సహాయం అం దిస్తున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ప్రారంభించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్‌ నాయకత్వంలో ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని, ప్రతి గ్రామానికి రోడ్డు మార్గం వేశామని చెప్పారు. గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, ఈ ఎన్నికల్లో మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేసి గ్రామ స్వరాజ్యం స్థాపించే విధంగా సహకరించాలని కోరారు.